భద్రాద్రిలో అరుణ్ సాగర్ పురస్కారాలు

 

భద్రాద్రి కొత్తగూడెం : ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పేరిట ప్రతీ సంవత్సరం ఇచ్చే పురస్కారాలను భద్రాచలంలోని శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు అరుణ్ సాగర్ పురస్కారాల సభ ముస్తాబయింది.
ఈ సంవత్సరం అరుణ్ సాగర్ పురస్కార జ్ఞాపికలను ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందించనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవార్డుల ప్రధానం ఉంటుందని తెలిపారు. అరుణ్ సాగర్ పురస్కారాల సభకు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో, విశిష్ట అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, సాక్షి పత్రిక సంపాదకులు వద్దెల్లి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. కవులకు, రచయితలకు, జర్నలిస్టులకు వేదికగా జరుగుతున్న ప్రముఖ కవి, జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పురస్కారాల సభకు అభిమానులు కవులు జర్నలిస్టులు సంఘ సంస్కర్తలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest