చింతలపల్లి, సోమారం (తొర్రూరు – పాలకుర్తి నియోజకవర్గం), మార్చి 29:
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావులు మహిళలతో కలిసి నేల మీద కూర్చుని సహపంక్తి భోజనాలు చేశారు. మహిళలతో కలిసి ముచ్చటిస్తూ, సరదాగా గడుపుతూ, భోజనాలు ఎలా ఉన్నాయి? రుచిగా ఉన్నాయా? అంటూ, వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ, వారితో మమేకం అయి కలిసి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు వారి సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉష దయాకర్ రావు గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలలో గ్రామాలకు మంత్రి వరాలు
ఆత్మీయ సమ్మేళనాలల్లో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన అభివృద్ధికి నిధులను మంత్రి మంజూరు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామానికి దుర్గమ్మ గుడి కి, మహిళా భవనం కి, గ్రామ పంచాయతీ భవనానికి నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో 10 వ తరగతి పూర్తి చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పటించి, కుట్టు మిషన్లు పంపిణీ హామీ ఇచ్చారు. చింతలపల్లి కి ఆంజనేయ గుడికి, బొత్తల తండాలో దుర్గమ్మ గుడికి, ఇంకా అంతర్గత రోడ్లు, ఇతర సదుపాయాల కోసం నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.