హైదరాబాద్ , ఫిబ్రవరి 15 :
కాంగ్రెస్ హైదరాబాద్ ఎస్సీ సెల్ చైర్మన్ రమేష్ అధ్వర్యంలో హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభించారు. ఆ తరువాత ఈ పాదయాత్ర పంజాగుట్టకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ చిత్రపటానికి, వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఖైరతాబాద్ చౌరస్తాలో స్వర్గీయ పి . జనార్ధన్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. సోమాజిగూడ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర గాంధీ భవన్ కు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ డీసీసీ అద్యక్షులు డా. రోహిన్ రెడ్డి , నియోజకవర్గ కాంగ్రెస్ డివిజన్ అద్యక్షులు నరేష్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ , రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మాట్లాడారు. హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధీ సందేశాన్ని చెప్పాలని రోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి.. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని చెప్పారు.