చెన్నై
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు సాగర్ (సాగర్) (70) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. సాగర్ పూర్తి పేరు విద్యాసాగర్ రెడ్డి (విద్యాసాగర్ రెడ్డి)గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్ గురువారం ఉదయం చనిపోయారు. ”రాకాసి లోయ ” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సాగర్ అంతకుముందు కొంతకాలం ఎడిటర్ గా పని చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తో ”అమ్మ దొంగ” అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. స్టువర్ట్ పురం దొంగలు, ఓసి నా మరదలా, అన్వేషి, రామసక్కనోడు తదితర సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వి వి వినాయక్, శ్రీనువైట్ల , యజ్ఞం దర్శకుడు రవి కుమార్ చౌదరి సాగర్ శిస్యులే. దర్శకుల సంఘానికి సాగర్ అధ్యక్షుడిగా కొంతకాలం పని చేశారు.
Post Views: 29