GHMC ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ పై విజిలెన్స్ విచారణ పూర్తి

హైదరాబాద్

జీహెచ్ఎంసీలో సంచలం సృష్టించిన ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ పై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఇందుకు సంబంధించిన నివేదిక ను జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు అందచేశారు ఈ.వి. డి.ఎం అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డి. 10 పేజీల నివేదిక తో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది.
బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామంటున్న జిహెచ్ఎంసి విజిలెన్స్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.జీహెచ్ఎంసీలో ఇటీవల సంచలనం సృష్టించిన నాన్ అవెలిబిలిటీ నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సోమవారం ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ విచారణ ముగిసింది. నకిలీ సర్టిఫికెట్ల జారీ అయిన తీరు,అందుకు కారణాలను గుర్తించిన ఈవీడీఎం డైరెక్టర్ ఎన్. ప్రకాశ్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కు పది పేజీల నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ లేకుండా సుమారు 22 వేల 984 నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఈ వ్యవహారంలో పలు మీ సేవా కేంద్రాలు సుమారు 21 వేల 85 బర్త్ సర్టిఫికెట్లను, మరో 1869 డెత్ సర్టిఫికెట్లను ఎలాంటి ఆర్టీఓ ప్రొసీడింగ్ లేకుండా అప్ లోడ్ చేసినట్లు విజిలెన్స్ తన నివేదికలో కమిషనర్ కు వెల్లడించింది. నకలీ సర్టిఫికెట్లకు సాఫ్ట్ వేర్ లోని లొసుగులు అక్రమార్కుకు వరంగా మారిందని, మరి కొన్ని చోట్ల భారీగా లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు జారీఅయినట్లు విజిలెన్స్ ధృవీకరించింది.ఇందుకు నలుగురు అధికారులను బాధ్యులను చేస్తూ త్వరలోనే చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతుంది. సాఫ్ట్ వేర్ లోని లొసుగులు, లోపాల వల్లే నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఈవీడీఎం ధృవీకరించినా, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఐటీ విభాగంలోని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని ప్రస్తావించటం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేవలం సర్కిళ్ల వారీగా విధులు నిర్వర్తించే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లకే చర్యలు పరిమితం కావటం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది.ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 30 సర్కిళ్లలో ఈ నాన్ అవెలిబిలిటీ నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల కు
సంబంధించిన నగరంలోని 250 మీ సేవా కేంద్రాలపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ
సిద్దమవుతోంది. సర్టిఫికెట్ జారీ చేసిన అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు (ఏఎంసీ)లు, మెడికల్ ఆఫీసర్లు తమ తమ పరిధిలోని మీ సేవా కేంద్రాలపై ఫిర్యాదులు చేసిన కేసులు నమోదు చేయించాలని జీహెచ్ఎంసీ ఇప్పటికే సర్కిళ్లకు ఆదేశాలు జారీ చేసింది. కానీ సాఫ్ట్ వేర్ లోని లొసుగుల కారణంగా సర్టిఫికెట్ల జారీ కి సంబంధం లేని కొందరు ఏఎంసీలు, మెడికల్ ఆఫీసర్ల మెడకు ఈ ఉచ్చు చుట్టుకుంది.

సర్టిఫికెట్ల జారీ, అవినీతితో ఎలాంటి సంబంధం లేని తామెందుకు కేసులు నమోదు చేయాలని కొందరు ఏఎంసీలు, మెడికల్ ఆఫీసర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా సాఫ్టే వేర్ లోపాల వల్లే నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లు విజిలెన్స్ విచారణ నివేదిక స్పష్టం చేస్తున్నా, తామెందుకు ఫిర్యాదు చేయాలని ప్రశ్నిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest