Health Rate జ్వరం గోళీలు సహా 800 రకాల మందుల ధరలు భారీగా పెంచేసిన కేంద్రం

 

  • దేశంలోని 90 శాతం జనాభాపై ప్రభావం చూపేలా
  • మందుల ధరలనూ భారీగా పెంచబోతున్నది మోదీ సర్కార్‌
  • ఏప్రిల్‌ 1 నుంచి మందుల ధరలు ఏకంగా 12.12 శాతం పెరగనున్నాయి

ఢిల్లీ

ఆకలేస్తే ఏం తినేటట్టు లేదు.. అవసరమొస్తే ఏం కొనేటట్టు లేదు.. చివరకు రోగమొస్తే మింగేందుకు ఏదీ దొరికేటట్టు కూడా లేదు.ఇదీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాలన తీరు.గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూ పోయిన కేంద్రం.. ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడుగు తున్నది.

వచ్చే నెల మొదలు పెయిన్‌ కిల్లర్‌ దగ్గర్నుంచి షుగర్‌, బీపీ, గుండె ఇలా అత్యంత ప్రధానమైన ఆరోగ్య సమస్యలకు, ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా కనిపించే రుగ్మతలకు వాడే ప్రతీ మందు గోళి రేటు మండిపోనున్నది మరి. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సగటు మనిషి బతుకుకు భరోసా లేకుండా ఏకంగా ఔషధాల ధరలను ఏప్రిల్‌ 1 నుంచి 12 శాతానికిపైగా పెంచుతున్నది బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం.

జ్వరం,బీపీ,రక్త హీనత,డయాబెటిస్‌,గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, మెడికల్‌ డివైజ్‌ల ధరలు భారీగా పెరిగాయి. అత్యవసర జాబితాలో ఉన్న 800 రకాల ఔషధాల ధరలను కేంద్రప్రభుత్వం ఏకంగా 12.12% పెంచింది. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్‌పీపీఏ) వెల్లడించింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డ్రగ్స్‌ (ప్రైస్‌ కంట్రోల్‌) ఆర్డర్‌, 2013 ప్రకారం.. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

👉అప్పుడు కరోనా పేరు చెప్పి..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి ఇప్పటివరకూ మందుల ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయి. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌, ఇతరత్రా కారణాల పేరిట కేంద్రం మందుల ధరలను ఏటేటా పెంచుకుంటూ వస్తున్నది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్‌ పెరిగిందని,ఉచిత వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది. జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి చరిత్రలో ఔషధ ధరలపై ఈ స్థాయిలో పెంపుదల ఇదే మొదటిసారి.

👉ఏయే మందుల ధరలు పెరుగనున్నాయి?

జ్వరం మందులు (పారాసిటమాల్‌ వంటివి)
యాంటి బయోటిక్స్‌ (అజిత్రోమైసిన్‌ వంటివి)
అంటువ్యాధులు
గుండె సంబంధిత వ్యాధులు
రక్తపోటు (బీపీ)
డయాబెటిస్‌ (షుగర్‌)
చర్మవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు
రక్తహీనత (ఫోలిక్‌ యాసిడ్‌ వంటి ఔషధాలు)
రక్తప్రసరణ సంబంధిత జబ్బులు
క్షయ (టీబీ)
వివిధ రకాల క్యాన్సర్లు
మినరల్‌, విటమిన్‌ తదితర గోళీలు
మరో 800 రకాల అత్యవసర ఔషధాలు, మెడికల్‌ డివైజ్‌లు
(ఆధారం: ఎన్‌పీపీఏ ధరలు,కేంద్ర ప్రభుత్వ గణాంకాలు )

👉దేశ జనాభా 140 కోట్లు

ఏదో విధంగా మందులు వాడుతున్నవారు 126 కోట్లు
కుటుంబానికి ఐదుగురుచొప్పున లెక్కేసుకొంటే మొత్తం ఫ్యామిలీలు 25 కోట్లు

ఒక్కో కుటుంబం సగటున నెలకు మందుల కోసం వెచ్చిస్తున్న మొత్తం 4,000

దేశంలోని మొత్తం కుటుంబాలు మందుల కోసం నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.లక్ష కోట్లు

మందుల ధర 12.12% పెరుగడంతో కుటుంబాలపై అదనంగా పడనున్న భారం 12,120 కోట్లు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest