అమెరికా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాపులారిటీ తగ్గుతోందా? అంటే అవుననే అంటున్నారు కొంతమంది అమెరికన్లు. ఇదే విషయాన్నీ వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ నిర్వహించిన సర్వేలో తేలింది. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లు అవుతున్న ఆయన పెద్దగా సాధించిందేమీ లేదని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. అరవై రెండు శాతం మంది ప్రజలు అమెరికా అధ్యక్షుడు పెద్దగా ఏమి సాధించలేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ముఫై ఆరు శాతం మంది ప్రజలు మాత్రం బైడెన్ మంచి పని చేస్తున్నారని కితాబు ఇచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. యుఎస్ లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించిన సర్వేలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఎలా రాణిస్తున్నారో వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
Post Views: 48