ఆస్ట్రేలియా
ఓ ప్రముఖ బీచ్ లో షార్క్ చేప ఓ యాభై యాభైతొమ్మిదేళ్ళ మనిషిని చంపేసింది. న్యూ కాలేడోనియాలోని బీచ్ లో ఈ సంఘటన జరిగింది. ఆస్ట్రేలియార్ కు చెందిన ఆ పర్యాటకుణ్ణి షార్క్ చేప అందరు చూస్తుండగానే చంపేసింది. ఆదివారం నౌమియా లోని ప్రముఖ బీచ్ వద్ద ఒడ్డు నుంచి 150 మీటర్ల దూరంలో ఈత కొడుతుండగా షార్క్ చేప అతనిపై దాడి చేసింది. పలు మార్లు కాటు వెయ్యడంతో తీవ్ర గాయాలై అతను అక్కడిక్కక్కడే మృతి చెందాడు. చాటూ రాయల్ బీచ్ వద్ద షార్క్ చేప దాడి చెయ్యడం మూడు వారాల్లో ఇది మూడోసారి. ఈ సంఘటన జరిగినప్పుడు చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ భయాందోళనతో ఎవరూ అతన్ని రక్షించడానికి దగ్గరకు వెళళ్లేడు. షార్క్ చేప వదిలేసినా తరువాత స్థానిక ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో సమీపంలోని బీచ్లను అధికారులు మూసేశారు. నీటిలో ఉన్న సొరచేపలు పట్టుకోవాలని ఆదేశించారు.
Post Views: 45