ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే నెలలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఖార్కివ్ , జపార్జియా లోని కీలకప్రాంతాలపై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. దీంతో ఉక్రెయిన్ దక్షిణ , తూర్పు ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. రష్యా ఆయా ప్రాంతాల్లో దాడులను ఉదృతం చేసింది. జపోర్జియా నగరంలో ఒక గంటలో సుమారు పదిహేడు సార్లు దాడులు చేశారని జపోర్జియా సిటీ కౌన్సిల్ సెక్రటరీ అనటోలి కుర్టీవ్ అన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తే జపోర్జియా లో జరిగిన దాడులు అత్యంత విధ్వంసకర దాడులుగా ఆయన పేర్కొన్నారు. తూర్పు ప్రాంతం భీకర పోరాటాలకు సాక్షిగా నిలిచింది.
Post Views: 65