అమెరికా , 11 ఫిబ్రవరి :
అలస్కా పై ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువుని కాల్చివేశామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సి ఎన్ ఎన్ కు తెలిపారు. ఎదో గుర్తు తెలియని వస్తువు అలస్కాపై ఎగుతుండటం గమనించిన తమ సైనికులు దాన్ని కాల్చివేశారని ఆయన పేర్కొన్నారు. నిజానికి పైన ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువుని గురువారమే గుర్తించారని చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆదేశాల మేరకు పైన ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువుని కాల్చివేశారని తెలిపారు. తొలుత గుర్తించిన సమయంలో కిందకు దించేందుకు కమాండర్ ఇన్ చీఫ్ అమెరికా మిలిటరీకి ఆర్డర్ ను అందించినట్లు జాతీయ భద్రత అధికారులు తెలిపారు. మీడియా ఇంటరాక్షన్ వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఈ విషయాలను వెల్లడించారు. నాలుగు వేల అడుగుల పైన తెలుగుతున్న వస్తువుని కూల్చి వేశామని తెలిపారు.
Post Views: 45