అబూజా :
నైజీరియా లో చాలా ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరిగాయి. 1999 లో సైనిక పాలన తరువాత నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే ఆయా పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా కనిపించింది. చాలా మంది యువతీ యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి బారులు తీరారు. ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే వారు తెల్లవారు జామునే పోలింగ్ బూత్ ల దగ్గర బారులు తీరారు. ఏ పీ సి, పీ డీ పీ రెండు పార్టీల ఆధిపత్య పోరు ఉంటుంది. అయితే లేబర్ పార్టీకి చెందిన పీటర్ ఓబీ కు చాలా మంది యువత మద్దత్తు ఉంది. పదివేల పోలింగ్ స్టేషన్ లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అన్ని ప్రాంతాల్లో లెక్కించిన ఓట్లను అబూజాలోని ఎన్నికల ప్రధాన కార్యాలయానికి పంపిస్తారు. ఈ ఎన్నికలకు సంబధించి మంగళవారం నాటికి తుది ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ పలు కారణాల వల్ల ఆలస్యంగా ప్రారంభమైందని, ఇందుకుగాను క్షేమించాలని ఎలక్ట్రోరల్ చీఫ్ మహమ్మద్ యాకుబు పేర్కొన్నారు. క్యూ లో ఉన్నవారిని మాత్రం ఓటు వెయ్యడానికి అనుమతిస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు.