పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

పాకిస్తాన్

పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు​ పర్వేజ్​ ముషారఫ్​ (79) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అమిలోడయాసిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీ లో జన్మించిన ముషారఫ్‌ దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పాక్‌ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్‌ 1999లో నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌ ప్రధాన కారకుడు. 2016 నుంచి ఆయన దుబాయ్​లోనే ఆశ్రయం పొందుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest