పెషావర్ (పాకిస్తాన్) :
పాకిస్తాన్ లోని పెషావర్ లో పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్టు అర్థమవుతోంది. ఇక్కడ జరిగిన బాంబు దాడిలో యాభై మంది చనిపోయారు. పెషావర్ లోని మజీదులో నమాజ్ చదువుతున్నప్పుడు బాంబు దాడి జరిగింది. మజీదుకు రక్షణ కల్పించే పోలీసులు ఉండే హెడ్ క్వార్ట్రర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్ లో భయాందోళనలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రధాని షెబాజ్ షరీఫ్ అన్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించలేదు.
Post Views: 61