ఫ్రాన్స్ :
ఫ్రెంచ్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణలను ప్రారంభించింది. దీంతో సెంట్రల్ ప్యారిస్ లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యలో పోలీసులకు , నిరసనకారులు మధ్య ఘర్షణ జరిగింది. నిరసన కారులు నిప్పు పెట్టారు. పోలీసులపై బాణాసంచా విసిరారు. నిరసన కారులను చెదరగొట్టరానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుల మాక్రాన్ పదవి విరమణ వయసును ఓటు లేకుండా 62 నుంచి 64 కు పెంచడాన్ని నిరసించారు. దీంతో రెండు రోజులుగా ఇక్కడ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. దీనికి పార్లమెంట్ లో లెఫ్ట్ వింగ్ నుపేస్ సంకీర్ణ సభ్యులు సంతకం చేశారు. తరువాత తీవ్రవాద రాజకీయ పార్టీ నుంచి వచ్చింది. ఈ రెండింటి పై వచ్చే వారం చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యలో ర్యాలీ తీసిన ఎంపీల నాయకురాలు మెరైన్ లే పెన్ మాట్లాడుతూ పెన్షన్ మార్పుల ద్వారా ముందు తెచ్చే నిర్ణయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
