లండన్ :
చైనాపై బ్రిటన్ ప్రధాని సీరియస్ రిషి సునాక్ సీరియస్ అయ్యారు. చైనా నిఘా బెలూన్లు బ్రిటన్ ను కూడా టార్గెట్ చేశాయని వార్తలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సీరియస్ గా స్పందించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఎం చేయడానికైనా సిద్ధమేనని దేశ ప్రజలకు తెలియజేస్తున్నానని రిషి సునాక్ అన్నారు. ఈ విషయంలో ప్రజలకు తనకు భరోసా ఇస్తున్నానని అన్నారు. బ్రిటన్ గగనతలంలో అనుమానాస్పద వస్తువులు ఏవి కనిపించినా విమానాలతో కూల్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రిషి తెలిపారు. దేశ ప్రజల సంరక్షణ కోసం ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు.
Post Views: 59