టర్కీ :
టర్కీ -సిరియా భూకంప బాధితుల సంఖ్య ముఫై అయిదు వేలకు దాటింది. తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ లేక అంధకారంలో మగ్గుతున్నారు. అనేక మంది ఆశ్రయం లేకుండా బతుకుతున్నారు. న్యూజిలాండ్ నుంచి విమానాలు కూడా నిలిచిపోయాయి. భూకంపం రావడంతో పూర్తిగా దెబ్బ తిన్న సిరియా , టర్కీ ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇండియా ఆర్మీ సిరియా- టర్కీకి వెళ్లి సహాయం చేపట్టింది.
