చెన్నై
ఎల్ టి టి ఈ(LTTE) మాజీ చీఫ్ ప్రభాకరన్ (prabhakaran)బతికే ఉన్నారని తమిళ రాజకీయా నాయకుడు ఒకరు చేసిన ఆరోపణలను శ్రీలంక తోసిపుచ్చింది. ప్రభాకరన్ సరైన సమయంలో ప్రజల్లోకి వస్తారని తమిళ రాజకీయ నాయకుడు తమిళ జాతీయవాద నాయకుడు నెడు మారన్ (nedu maran)సోమవారం వ్యాఖ్యానించాడు. అయితే ఈ వాదనలను శ్రీలంక తోసిపుచ్చింది. చాలా ఏళ్ళ క్రితమే ప్రభాకరన్ చనిపోయారని శ్రీలంక సైన్యం ఎప్పుడో ప్రకటించింది. అప్పట్లో ప్రభాకరన్ చిత్రపటాన్ని కూడా శ్రీలంక అప్పట్లో విడుదల చేసింది. అందరు ప్రభాకరన్ గురించి మరచిపోయిన నేపథ్యంలో నెడు మారన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య కలకలం రేగింది. ప్రభాకరన్ జనంలోకి వస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
.
Post Views: 39