న్యూ ఢిల్లీ
బి ఆర్ ఎస్ ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ మంగళవారం ముగిసింది. వరుసగా రెండు రోజుల పాటు విచారించిన ఈడీ కవితకు స్వల్ప బ్రేక్ ఇచ్చారు. మంగళవారం సుమారుగా పది గంటల పాటు ఈడీ విచారించింది. ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన కవిత రెండు కవర్లలో ప్యాకింగ్ చేసిన సెల్ ఫోన్లను మీడియాకు చూపించింది. గతంలో పది సెల్ ఫోన్లను కవిత ధ్వంసం చేసిందనే వార్తలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అందుకే కాబోలు ఈ రోజు విచారణకు వెల్తూ, వెల్తూ సెల్ ఫోన్లను మీడియాకు చూపించి మరీ విచారణకు వెళ్ళింది. అయితే రేపు విచారణ లేదని కవిత తరపు న్యాయవాదులు వెల్లడించారు.
Post Views: 132