KCR Order – కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల

హైదరాబాద్ , మే 25 :

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ.. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆరు దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న సందర్భంలో వేడుకలు వైభవంగా జరగాలని అన్నారు.

 

రోజు వారీ చేపట్టాల్సిన కార్యక్రమాలు :

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎంఒ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారీ కార్యక్రమాల గురించి.. రోజు వారీ చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు.

రూ.105 కోట్ల నిధులు విడుదల :

గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest