MLA సాయన్న ఇకలేరు

హైదరాబాద్ , ఫిబ్రవరి 19 :
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సాయన్న మృతితో బీ ఆర్ ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటివరకు సాయన్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ నేతగా ఎదిగిన సాయన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014 లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టి ఆర్ ఎస్ లో కలిశారు. వివాద రహితుడిగా పేరుగాంచిన సాయన్న అత్యంక్రియలు బన్సీలాల్ పేట స్మశాన వాటికలో మధ్యాహ్నం జరుగనున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest