ఆమ్ ఆద్మీ చేతికి ఢిల్లీ మేయర్ పీఠం

న్యూ ఢిల్లీ , ఫిబ్రవరి 22 ;
ఢిల్లీ మేయర్ పీఠం అందరూ ఊహించినట్టే అయింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొంత కాలంగా మేయర్ పోటీ విషయంలో వివాదం నడిచినా ఎట్టకేలకు జరిగిన ఎన్నికలో ఢిల్లీ మేయర్ పీఠం( మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్, బీజేపీ మేయర్ అభ్యర్థిగా రేఖ గుప్తా బరిలో దిగారు. షెల్లీ ఒబెరాయ్ కు 150 ఓట్లు రాగ, రేఖ గుప్తా కు 116 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 226 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. బీజేపీ మేయర్ అభ్యర్థి రేఖ గుప్తా పై 34 ఓట్ల మెజారిటీతో షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ డిప్యూటీ మేయర్ గా అలె మహ్మద్ ఎన్నికయ్యారు. ఆయనకు 147 ఓట్లు వచ్చాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest