న్యూ ఢిల్లీ :
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయులకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. 95వ ఆస్కార్ అవార్డులలో భారతీయ కంటెంట్‌కు 2 అవార్డులు వచ్చాయి. ఇది బ్రాండ్ ఇండియా , ఇది ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. భారతదేశం ఇండియా ప్రపంచానికి కంటెంట్ హబ్‌గా మారబోతోంది అన్నారు. నాటు నాటు అనే పాట తెలుగులో, అనేక భారతీయ భాషలలోకి డబ్ చేయబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది.చిన్న బడ్జెట్, చిన్న డాక్యుమెంటరీ, ది ఎలిఫెంట్ విస్పరర్ గొప్ప గౌరవాన్ని సాధించింది. RRR మరియు ది ఎలిఫెంట్ విస్పరర్ వెనుక ఉన్న మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను. అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
Post Views: 43