దిల్లీ:
ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్(Union Budget 2023-24)లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ నుంచి కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్‌లో సుంకాలు, పన్ను స్లాబు ల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కొన్నివస్తువులు ధరలు పెరగనున్నాయి. మరికొన్ని తగ్గనున్నాయి.
ధరలు పెరిగేవి..
ప్రైవేటు జెట్స్
హెలికాప్టర్లు
దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు
ప్లాస్టిక్ వస్తువులు
బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, ప్లాటినం
ఇమిటేషన్ ఆభరణాలు
ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు
సిగరెట్లు
ధరలు తగ్గేవి..
దుస్తులు
వజ్రాలు, రంగు రాళ్లు
బొమ్మలు
సైకిళ్లు
టీవీలు
ఇంగువ, కాఫీ గింజలు
శీతలీకరించిన నత్తగుల్లలు
మొబైల్ ఫోన్లు
మొబైల్ ఫోన్ ఛార్జర్లు
కెమెరా లెన్స్‌లు
భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు
పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు
లిథియం అయాన్ బ్యాటరీలు.