న్యూఢిల్లీ :
కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మే 13న ఎన్నికల ఫలితం వెలువడుతుందని ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ : 2023 ఏప్రిల్ 13నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: ఏప్రిల్ 20నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 21నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 24కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: మే 10