కర్ణాటక ఎన్నికలకు స్టార్ కంపైనర్ రేవంత్

హైదరాబాద్

కర్ణాటక ఎన్నికల్లో స్టార్ కంపైనర్ గా రేవంత్ వ్యవహారించనున్నారా?ఆయన తో పాటు టీ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయబోతున్నారా? తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో ప్రచార భాధ్యతలు ఎవరికి అప్పగించారు? కర్ణాటక, తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో ఎవరి ప్రభావం ఏంత?

మే నెలలో కర్ణాటక లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కు కర్ణాటక కాంగ్రెస్ అన్ని శక్తులను ఉపయోగిస్తుంది.. అందులో భాగంగా తెలంగాణ ,కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో ప్రచార భాధ్యత ను టీ కాంగ్రెస్ నేతలకు అప్పగించింది ఏఐసీసీ. ఇప్పటికే కర్ణాటక లోని మూడు జిల్లా లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంఛార్జి భాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. కోలార్ జిల్లా కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్ ను ,హావేరి జిల్లా కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు ,మాండ్య జిల్లా కు సీనియర్ నేత కుసుమ కుమార్ కు ఇంఛార్జి భాధత్యలు అప్పగించారు.

వీరితో పాటు టీ కాంగ్రెస్ లో చరిష్మా ఉన్న నేతలందరినీ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. స్టార్ క్యాంపెనర్లు గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి తో చర్చించారట. స్టార్ కంపైనర్ జాబితాలో రేవంత్ పెరు ను చేర్చుతారట. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు కల నియోజకవర్గాలు దాదాపు 36 వరకు ఉన్నాయి.. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి ,మహాబూబ్ నగర్ ,మెదక్ జిల్లా లలకు చెందిన నేతలకు ఎక్కువ గా ఎన్నికల ప్రచార భాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.

కర్ణాటక ఎన్నికల్లో రెడ్ల ప్రభావం ఎక్కువే ,ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో రెడ్లు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో ఉన్న 36 రెడ్ల ప్రభావం ఉన్న నియోకవర్గాల్లో రేవంత్ రెడ్డి కి ప్రచార భాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. యస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో సీఏల్పీ నేత భట్టి కి ప్రచార భాద్యతలు ఇవ్వనున్నారట…ఓవరాల్ గా తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అన్ని నియోజకవర్గాల్లో ఇటు టీ పీసీసీ, అటు ఏపీ కి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ప్రచార రంగంలోకి దిగబోతున్నారు..

ఏఐసీసీ సెక్రటరీ లు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి లు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెల్లనున్నారు..ఇప్పటికే కర్ణాటక ఏఐసీసీ ఇంఛార్జి సెక్రటరీ గా ఉన్న శ్రీధర్ బాబు దాదాపు వంద నియోజకవర్గాల ఇంఛార్జి భాధ్యతలు చూస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్న మధుయాష్కీ దాదాపు నెల రోజులు ప్రచారం లో పాల్గొనున్నట్లు సమాచారం. వీరితో పాటు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సీతక్క , దామోదర రాజనర్సింహ లాంటి నేతలు విడతల వారిగా ప్రచారం లో పాల్గొనే అవకాశం ఉంది.

మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ,అది తెలంగాణ కాంగ్రెస్ ఉపయోగపడుతుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.. సాధ్యమయినంతమేరకు తెలుగు ఓటర్లు అంతా కాంగ్రెస్ వైపు ఉండేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు..చూడాలి మరి టీ కాంగ్రెస్ నేతల ప్రచారం కర్ణాటక కాంగ్రెస్ కు ఏ మేరకు పనిచేస్తుందో.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest