బెంగళూరు :
మల్లేశ్వరం బెంగళూరు, తుమకూరులో చకచకా ఏర్పాట్లు అంతర్జాతీయ వస్తుప్రదర్శన కేంద్రంలో ఇండియా ఎనర్జీ వీక్ -2023 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉద్యాననగరికి రానున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11:30కు ఇథనాల్ మిశ్రమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇ-20 ఇంధన ఉపక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30కు బెంగళూరు నుంచి తుమకూరు చేరుకుని హెచ్ ఏఎల్ పరిశ్రమను ప్రారంభిస్తారు. భారత్ లో తయారీ నినాదానికి అనుగుణంగా రక్షణశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా తుమకూరులో హెచ్ ఏల్ హెలికాప్టర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. తుమకూరు పారిశ్రామికవాడ, పట్టణంలో 2 జలజీవన్ అభియాన్ పథకాలకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు.మోదీ 2016లో తుమకూరులో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. హరిత వలయంలో 615ఎకారాల విస్తీర్ణంలో వస్తున్న ఈ పరిశ్రమ ఏర్పాటుతో హెచ్ ఏఎల్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడం రక్షణశాఖ అవసరాలకు కావలసిన హెలికాఫ్టర్లను అందించడంతో పాటు స్థానికులు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తుమకూరులో 3 దశలలో 8484ఎకరాల్లో ఈ పారిశ్రామికవాడు అభివృద్ధి చేస్తారు.. బెంగుళూరు – చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగం కానుంది. తుమకూరు జిల్లా చిక్కనాయనహళ్లి, తిపటూరులో జల్ జీవన్ అభియాన్ పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తిపటూరులో రూ. 430కోట్లు, చిక్కనాయనకహళ్లిలో రూ. 115కోట్లతో స్థానికులు తాగునీటి సదుపాయాలను కల్పించేందుకు ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. ఈ నెల 13న హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ రాక శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని తర్వాత సికింద్రాబాద్ రైల్వే పలుకార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు.. బహిరంగ సభ మోదీ ప్రసగింస్తారు.