న్యూ ఢిల్లీ :
దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కొరోనా కేసులపై ప్రధాని మోడీ సమీక్షించారు. ఉన్నతస్థాయి ప్రధాని సమీక్ష జరిపారు.న్యూ ఢిల్లీలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని పలు సూచనలు చేశారు. క్రీయాశీలక కేసుల సంఖ్య ఏడువేలకు దాటిందని అధికారులు ప్రధానికి వివరించారు. ఇరవై నాలుగు గంటల్లో 1, 134 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.రోజువారీగా 1. 09 శాతంగా కేసులు నమోదవుతున్నాయని , అయితే సమీక్ష జరిగే సమయానికి 0. 98 శాతంగా ఉందని వివరించారు. కొరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పకడ్బందీగా అమలు చెయ్యాలని మోడీ అధికారులను సూచించారు. మందులు అన్ని అందుబాటులో ఉంచాలని చెప్పారు. మనదేశంలో కొరోనా అదుపులోనే ఉందని, అయితే రోజు రోజుకు కేసులు పెరగకుండా తగ్గించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
