ఢిల్లీ:
రాజ్యసభలో విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం పై కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో విపక్షాలు భేటీ అయ్యారు.పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసిన నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సహా ఇతర విపక్ష 17 పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట ఆందోళన చేస్తునే ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఇదే విషయంపై అనుసరించాల్సిన అంశంపై నేతలు చర్చించారు. బి ఆర్ ఎస్ పార్టీ తరపున రాజ్య సభ పక్ష నేత కె . కేశవ్ రావు, లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు కూడా హాజరైయ్యారు.
