ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు అల్ప పీడన ద్రోణి

విశాఖ:

పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు అల్ప పీడన ద్రోణి పయనిస్తుందని విశాఖ పట్నం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు పడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. విజయవాడ సిటీ, విశాఖ సిటీలకు భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest