నాలుగేళ్ళ క్రితం AXIS BANK MANAGER- ఇప్పుడు బస్సు డ్రైవరు

పూణే :

మహారాష్ట్ర శీతల్ శిందే 2014 నుంచి పూణేలోని (AXIS BANK MANAGER )యాక్సిస్ మేనేజరుగా నాలుగేళ్ల విధులు నిర్వహించిన ఈమె బస్సు డ్రైవరుగా మారేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మంచి జీతం. ఏసీ గదిలో విధులు. అయినా శీతల్ శిందే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర శిక్షణ పూర్తి కావచ్చింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో యంహెచ్ఆర్ ఆర్ టీసీలో చేరానని శీతల్ చెబుతున్నారు. మహారాష్ట్ర ఆర్ టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికే ఉన్నప్పటికీ, 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల భర్త ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. మధ్యలో కొవిడ్ కరోనాతో విరామం రాగా, చివరకు 17మంది మహిళలు మిగిలారు. వీరిలో ఒకరైన శీతల్ శిందే మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్టీసీ తొలి మహిళా డ్రైవరుగా విధులు చేరనున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest