దిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష- 2023 తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే 5వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్షను మే 21న నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన నోటిఫికేషన్ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది. తాజాగా పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకోవడంతో ఆన్లైన్ దరఖాస్తు గడువును మార్చి 25 వరకు పొడిగించారు. మే 16న అడ్మిట్ కార్డులు, జూన్ 20న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ (ఎన్బీఈ) ప్రకటన విడుదల చేసింది.