బెంగళూరు , 12 నవంబర్ 2023 :
”ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం’
కర్ణాటకలో గృహలక్ష్మి పథకం సరిగా అమలు కావడం లేదు. ఉచితంగా 200 యూనిట్ల కరెంటిచ్చే గృహజ్యోతి పథకం అమలు కావడం లేదు. విద్యుత్ చార్జీలు పెంచిన సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. ప్రజలను, పారిశ్రామికవేత్తలను దగా చేస్తున్నారు. రైతులకు రూ.15 వేలు ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్ హామీ. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారు.ఇప్పటికే రూ.73 వేల కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారు. రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టింది అంటూ జేడీఎస్ అధినేత , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామి సెలవిచ్చారు. కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు సరిగ్గా అమలు చెయ్యడం లేదని చెప్పు అర్థముంది కానీ తెలంగాణ లో కేసీఆర్ పథకాలు బాగున్నాయని చెప్పడం అంటే కేసీఆర్ కు ఏజెంటుగా పని చేస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతూనే ఉంది. తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న వేల కర్ణాటక లో కుమారస్వామి ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ ను పొగడటం అంటే ఇక్కడ బి ఆర్ ఎస్ కు మేలు చెయ్యడానికేననేది సుస్పష్టం. కుమార స్వామి వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం కేసీఆర్ ను పిలవకుండా ప్రచారం చేసుకున్న కుమార్ స్వామి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కు ప్రయోజనం చేకూరేలా ప్రయత్నిస్తున్నారు. మరి కుమార్ స్వామి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో ? లేక కుమార్ స్వామి బోల్తా పడతాడో చూద్దాం.