బీజేపీ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డ ప్రియాంక

న్యూ ఢిల్లీ
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం చేస్తారో చేసుకోండి. మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిదని ఆమె ఢిల్లీలో మీడియాతో చెప్పారు. బీజేపీకి చెందిన మంత్రులు, ప్రధాని, ఇతర నాయకులూ ఎవరైనా కానీ నా తల్లి దండ్రుల గురించి, నా కుటుంబం గురించి, రాహుల్ గురించి ఇందిరా, నెహ్రుల గురించి ఎదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎదో ఒకటి అంటూనే ఉంటారు. ఇది దేశమంతా తెలుసు. దీనికి వ్యతిరేకంగా ఏ జడ్జి జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎవరిని డిస్క్వాలిఫై చెయ్యలేదు. వాళ్ళను అనర్హుడిగా ప్రకటించలేదు.
నా తమ్ముడు ఏం చేశాడు? అదాని గురించి మాట్లాడాడు. పార్లమెంట్ లో ప్రశ్నించాడు. అందుకే ఇదంతా జరిగింది.
ఈ కేసులో ఏడాది నుంచి స్టే ఉంది. అదానిపై ప్రశ్నించిన వెంటనే పాత కేసు ఎందుకు తోడాల్సివచ్చింది.ఈ ప్రభుత్వం అదానీ విషయంలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేదు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది.మా శరీరంలో ఉన్నది అమరుల రక్తం. త్యాగాల రక్తం. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రక్తం మాది. మేము భయపడం. ఏం చెయ్యాలనుకున్నారో చేయండి. మేము పోరాటం చేస్తాం. అని ప్రియాంక గాంధీ అన్నారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest