బీబీసీ డాక్యుమెంటరీని వ్యతిరేకించాలి:కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై

 

బెంగళూరు:

మైసూరు మహిళ నుంచి వెదురు బుట్టలు అందుకుంటున్న బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని విపక్ష నేత సిద్ధరామయ్య కూడా వ్యతిరేకించాలని కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పష్టం చేశారు.వాస్తవాలను వక్రీకరించి, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు విభిన్నంగా బీబీసీ డాక్యుమెంటరీని తయారు చేసిందన్నారు. దేశంలో నాయకుల మధ్య అంతర్గత అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ, దేశ గౌరవానికి సంబంధించి విదేశీయులు అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ప్రజలు అందరూ ఒక్కతాటిపై ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను వక్రీకరించడం ఎవరికీ భావ్యం కాదన్నారు. కాగినెల మఠాధిపతి చేతి నుంచి మైకును తాను లాక్కోలేదన్నారు. కాగినెల మఠాధిపతి చేసిన ఆరోపణలకు, బదులిచ్చేందుకు ఒకేసారి మైకు తీసుకోవడంతో చూసేవారికి మైకు లాక్కున్నట్లు అనిపించిందని తెలిపారు. మఠాధిపతి లేవనెత్తిన అన్ని అంశాలకు తాను బదులిచ్చానన్నారు. ఆ తర్వాత ఇద్దరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నామన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ విశ్వనాథ్ అక్కడ లేరన్నారు.. కాగినెల మఠాధిపతి తనకు గురువేనన్నారు. నంజనగూడు మేధార పేటలో వెదురు ఉత్పత్తులను తయారు చేసే మహిళలను సీఎం బసవరాజు ఆదివారం భేటీ అయ్యారు.కొందరు మహిళలు తాము చేసిన బుట్టలు, విసనకర్రలను సీఎంకు బహూకరించారు. సీఎంతో స్వీయచిత్రాలు, ఫోటోలు తీసుకునేందుకు కుటీర పరిశ్రమలను నిర్వహించే చిరు వ్యాపారులు, స్థానిక మహిళలు ఆసక్తి చూపించారు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest