రైతుల కోసం రాజస్థాన్ కొత్త చట్టం

రాజస్థాన్ :
రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం కొత్త చట్టం తీసుకురానుంది. అప్పుల పాలవుతున్న రైతుల కోసం కొత్త చట్టాన్ని తీసుకురావడం కోసం రాజస్థాన్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. పంటకు సరైన ధర రాక అనేక మంది రైతుల అప్పుల పాలవుతున్నారు. కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. నెలరోజుల్లో సంబంధిత బిల్లును సిద్ధం చెయ్యడానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేక చట్టంతో పాటు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అప్పుల పాలైన రైతులను ఆడుకోవడంతో పాటు రైతుల భూమిని వేలం వెయ్యకుండా అడ్డుకునే దిశగా ఈ కొత్త చట్టం రూపొందించనున్నారు. హై కోర్ట్ మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ ను కూడా నియమించనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest