వాయనాడ్ లో ఉప ఎన్నికకు తొందర లేదు : సీఈసీ

న్యూ ఢిల్లీ
మలయాళం లోని వాయనాడ్ లో ఉప ఎన్నిక కోసం తొందరపడొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంగం సూచించింది. వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నిక నివహించేందుకు తొదరపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఇటీవల రాహుల్ గాంధీ పై పార్లమెంట్ లో అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన వాయనాడ్ పార్లమెంట్ నియోకవరం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఉప ఎన్నిక నిర్వహించేందుకు తొదరపాటు వద్దని భారత ఎన్నికల సంఘం బుధవారం స్పష్టం చేసింది. ఒక స్తానం ఖాళి అయిన తరువాత ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఆరు నెలల సమయం ఉంటుంది. న్యాయపరమైన పరిష్కారానికి ట్రయల్ కోర్టు ముఫై రోజుల పాటు సమయం ఇచ్చింది. కాబట్టి తాము ఆ సమయం వరకు వేచి ఉంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గుజరాత్ లోని సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఐ పీ సి సెక్షన్లు 499, 500 కింద రాహుల్ గాంధీ దోషి అని సూరత్ కోర్ట్ నమ్మింది. కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ రెండేళ్ల పాటు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధిస్తు తీర్పు చెప్పారు.
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ పదిహేనువేల రూపాయల జరిమాన కూడా విధించింది. అయితే రాహుల్ గాంధీ అభ్యర్థన పై శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతే కాకుండా ముఫై రోజుల లోపు అప్పీల్ చేసుకోడానికి వీలుగా బెయిల్ కూడా మంజూరు చేసింది. 2019 లో కర్ణాటక రాష్ట్రం కోలార్ లో జరిగిన ర్యాలీలో మోడీ ఇంటిపేరుతో ఉన్నవారంతా డోనాగేలే అనే అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest