విమానంలో అర్ధనగ్నంగా 45 ఏళ్ళ మహిళా హల్ చల్

ముంబై
విమానంలో 45 ఏళ్ళ ఓ మహిళా అర్థ నగ్నంగా తిరిగింది. సిబ్బందిపై చెయ్యి చేసుకున్న సదరు మహిళా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా అర్ధ నగ్నంగా విమానంలో చక్కర్లు కొట్టింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులో తేరుకున్నారు. సోమవారం అబుదాబి నుంచి ముంబై వచ్చిన విస్తార విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎకనామిక్ క్లాస్ టికెట్ తీసుకున్న ఆ మహిళా తాను బిజినెస్ క్లాస్ లోనే కూర్చుంటానని పట్టు బట్టింది. దీనికి సిబ్బంది ఒప్పుకోకపోవడంతో సిబ్బందిపై దాడి చేసింది. అంతటితో ఆగలేదు. విమానంలో అర్ధ నగ్నంగా అటు ఇటు తిరుగుతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ఎన్నిసార్లు వారించిన సదరు మహిళా వినిపించుకోకపోవడంతో కెప్టెన్ వార్ణింగ్ కార్డు జారీ చేశారు. ఈ విషయాన్నీ ముంబై అధికారులకు సిబ్బంది సమాచారం అందించారు. ముంబైలో విమానం ల్యాండ్ అయినా తరువాత ఆమెను పోలీసులకు అప్పగించారు. ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest