సిసోడియా ఖేల్ ఖతం – మిగిలింది కవిత ?

న్యూ ఢిల్లీ :
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు , ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను అరెస్ట్ చేసిన సీబీఐ కన్ను ఇక కవిత పైననేన? అనేది చర్చించుకుంటున్న మాట. లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో ఇక మిగిలింది కవిత మాత్రమేనని ఢిల్లీ లో చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున చేతులు మారాయని సీబీఐ ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. గతంలో కూడా ఒకసారి కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపారు. అయితే ఈ సారి నోటిస్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించి కవితను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని ఢిల్లీ లో చర్చ జోరుగా సాగుతోంది. మరి సీబీఐ నిజంగానే కవితను అరెస్ట్ చేస్తుందా? లేదా?అనేది వేచి చూడాల్సిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest