ముంబై
బీసీసీఐ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశాడు. ఇటీవల చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైయ్యాయి. టీమ్ ఇండియా క్రికెటర్లతో పాటు బీసీసీఐ వ్యవహార శైలి పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చివరికి ఆయన రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు బయట పడ్డాయి. ఆయన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాయి. చేతన్ శర్మ కామెంట్స్ పై బీసీసీఐ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో చేతన్ శర్మ బీసీసీఐ సెలక్టర్ల పదవికి రాజీనామా చెయ్యడం, ఆయన రాజీనామాను సెక్రెటరీ జై షా అంగీకరించడం కూడా జరిగిపోయింది.
Post Views: 84