స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా – పీవీ సింధు


న్యూఢిల్లీ న్యూస్ :
దిల్లీ ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం కోసం ఐదు సంవత్సరాలు ఎదురు చూశనని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. ప్రొ వాలీబాల్ లీగ్ ఆరంభానికి అతిధిగా వచ్చిన సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ ” ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్స్ పతకం తరువాత అంతటి ఆనందం సంతోషంగా ఈ టోర్నీ గెలవడంతోనే వచ్చింది. ఎందుకంటే ఈ స్వర్ణం కోసం ఐదు సంవత్సరాలు ఎదురు చూశా, అంతకుముందు రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలిచా.. చివరికి 2019లో ప్రపంచ ఛాంపియన్ ని అయ్యా అని పీవీ సింధు స్పష్టం చేసింది. 2013-14 ప్రపంచ ఛాంపియన్ షిప్ ల్లో కాంస్యాలు నెగ్గిన పీవీ సింధు 2017-18ల్లో రజతాలు సొంతం చేసుకుంది. 2019 టోర్నీ ఫైనల్లో జపాన్ స్టార్ నవోమి ఒకుహరపై నెగ్గి విజేతగా పీవీ సింధు నిలిచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest