న్యూ ఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ప్రధానంగా ఆదాయపు పన్ను పై కేంద్రం ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆదాయపు పన్ను పరిధిని 7 లక్షల రూపాయల వరకు పెందించి. దేశంలోని మధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం శువైభవార్త లాంటిదేనని భావించవచ్చు. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని 3 లక్షల వరకు పెంచింది. 2023-24 కేంద్ర బడ్జెట్ బుధవారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. వ్యక్తిగతంగా 3 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 లక్షల పైన ఉన్న వాళ్ళు మాత్రమే కొత్త స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Post Views: 35