న్యూ ఢిల్లీ :
రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ పదిహేడు ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు. పార్లమెంట్ లోపల నిరసన తెలిపిన ఎంపీలు, పార్లమెంట్ బయట కూడా ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రాహుల్ గాంధీని ఇటీవల పార్లమెంట్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. నిరసన తెలిపిన ఏపీలలో తెలంగాణ కు చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.