Railway fine 200 కోట్లు వసూల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్

ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయాలంటే టికెట్ ఉండాలి, కానిబ్ టికెట్ లేకుండా కొంత మంది ప్రయాణం సాగిద్దాం అనుకుంటారు. వీరికే ఇప్పుడు టికెట్ కలెక్టర్లు షాక్ ఇస్తున్నారు. రైళ్లలో టికెట్ లేకుండా , అనధికార ప్రయాణాలు చేస్తోన్న వారికి ఫైన్లు వేస్తూ కలెక్షన్లలో రికార్డులను సృష్టిస్తున్నారు. 2022 – 23 సంవత్సరంలో దక్షణ మధ్య రైల్వే లో పని చేస్తున్న తొమ్మిది మంది టీ సీ లు టికెట్ లేకుండా ప్రయాణం చేసిన లక్షా 16 వేల మంది ప్రయాణికుల నుంచి ఏకంగా 9 కోట్ల 62 లక్షలను ఫైన్ల ద్వారా వసూల్ చేశారు. ఈ తొమ్మిది మంది టీ సీ లు ఒక్కొక్కరు కోటి రూపాయల జరిమానాలను విధించి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తోన్న వారికి టీసీ లు అడ్డుకట్ట వేస్తున్నారు.

దక్షిణ మధ్య రైల్వేలో తిరిగే అన్ని రైళ్లలో ఈ ఒక్క సంవత్సరంలో(2022-23) ఇప్పటివరకు 28 లక్షల 27 వేల మంది టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. వీరి వల్ల 200 కోట్ల రూపాయల వసూళ్లు దక్షిణ మధ్య రైల్వే కి వచ్చినప్పటికీ ఫైన్లను తో ఆదాయం రాబట్టాలనే ఉద్దేశం తమకి లేదని అనధికార ప్రయాణాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు అంటున్నారు.

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే 250 కి పైగా రైళ్లలో దాదాపు 8 నుంచి పది మంది ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణం చేయాలనుకునే వారు IRCTC వెబ్ సైట్, IRCTC మొబైల్ యాప్ , ఇతర ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలు లేదా స్టేషన్ టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్ కొని ప్రయాణం చేస్తూంటారు. కానీ టికెట్ లేకుండా , వ్యాలిడిటి అయిపోయిన టికెట్లతో కొంత మంది ప్రయాణికులు అనధికార ప్రయాణం చేస్తుంటారు. వీరికి అడ్డుకట్ట వేయడంలో పాటు టికెట్ తీసుకొని ప్రయాణం చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అనధికార ప్రయాణికులకు టికెట్ కలెక్టర్లు ఫెన్లను వేస్తూంటారు . ఇక కరోనా తర్వాత రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు .

ఒక్క సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే ఒక ఏడాదికి 28 లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారంటే దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో కోటి మందికి పైగా అనధికార ప్రయాణం చేసే అవకాశం ఉంది. టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి ఫైన్లు వేయండంతో పాటు టికెట్ కొని ప్రయాణం చేసే వారికి సీటు భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే అధికారుల మీద ఉంది. టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి కేవలం ఫైన్లు వేయడానికి మాత్రమే మాత్రమే పరిమితం కాకుండా టికెట్ లేకుండా ప్రయాణం చేయలుకునే వారిలో ఒక భయాన్ని కలిగించాలి. అంతే కాకుండా సామాన్య ప్రయాణికులు మరింత సులభంగా టికెట్ బుకింగ్ చేసుకునే కొత్త విధానాలను రైల్వే అధికారులు తీసుకురావాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest