కాగజ్ నగర్ :
భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుండగున్ని ఉరి తియ్యాలని దళిత సంఘాల నాయకులూ డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కొమురం భీం జిల్లాకాగజ్ నగర్ పట్నంలోని ఎన్టీఆర్ చౌకు వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా కేశవ్ రావు మాదిగ మాట్లాడుతూ మతోన్మాది అమర ప్రసాద్ అనే మూర్ఖుడు డాక్టర్ బి అంబేద్కర్ బాబాసాహెబ్ భారత రాజ్యాంగం రాసినప్పుడు ”నేను పుట్టి ఉంటే మహాత్మా గాంధీని గాడ్సే ఎలా కాల్చి చంపాడో నేను కూడా అలాగే అంబేద్కర్ ని కాల్చి చంపే వాడిని” అన్నందుకు అతన్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని, అతని పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశాడు. అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడము అంబేద్కర్ గారిని అవమానపరచడం అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు చేయడము పెరిగిపోతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా మతోన్మాదులను ప్రోత్సహిస్తూ భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారిని అవమానించిన వారిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేశంలో రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించి అంబేద్కర్ను అవమానపరిచిన మూర్ఖులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ అధ్యక్షులు పంబాల సతీష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మల్లెపల్లి రాజనర్సయ్య, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు పస్తం ఆంజనేయులు, బేడ బుడగ జంగాల జిల్లా కార్యదర్శి బన్న మూర్తి, వికలాంగులకు పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కంబాల రమేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎం సుభాష్, సిపిఐ ఎంఎల్ అన్వర్ వెంకట నరసయ్య, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు పత్తి మల్లేష్ , పి సాయికుమార్, సాయి, శ్రీనివాస్, కే సాయి, మల్లెపల్లి శ్రీకాంత్ , ప్రతాప్ , తౌటి రాజ్ కుమార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.