హైదరాబాద్ :
బీజేపీ అగ్ర నేత , హోమ్ మంత్రి అమిత్ షా క్లాస్ తరువాత తెలంగాణ బీజేపీ నేతల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఎవరికీ వారే యమునా తీరే చందంగా ఉన్న తెలంగాణ గులాబీ దళం ఇప్పుడు కాస్త ఐక్యత రాగాన్ని వినిపిస్తున్నట్టు కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమల నిర్వాహనలో కూడ స్పీడును పెంచారు.ముఖ్య నాయకుల డిల్లీ టూర్ తర్వాత బీజేపీ శ్రేణులు దూకుడు కనిపిస్తోంది.
క్రమశిక్షణ పార్టీ బిజెపిలో కూడా కనిపించని అసమ్మతి… అసంతృప్తి చాలా ఉంది.ముఖ్య నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం లేక పోవడంతో పార్టీ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో నిర్వహించ లేకపోతున్నారని జాతీయ నాయకులు పలు మార్లు రాష్ట్ర నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా నాయకుల మద్య సమన్యాయం లేకపోవడంతో పాటు ఐక్యత కనిపించలేదు. గ్రూపులుగా, వర్గాలుగా బీజేపీ నేతలు చీలుతు వ్యక్తిగత బలాన్ని పెంచుకుంటున్నారు.అంతే అంతటితో ఆగకుండా ముఖ్య నాయకులు ఒకరిపై ఒకరు డిల్లీకి ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో జాతీయ నేతలకు తెలంగాణ బీజేపీ నేతలపై ఆగ్రహం మరింత పెరిగింది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఢీకొని అధికారంలోకి రావాలని జాతీయ నాయకత్వం ఆశిస్తుంటే ఇక్కడి నేతలు అదిష్టానానికి తలనొప్పిగా తయారయ్యారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణ జాతీయ నాయకత్వం ఇస్తుంది. ఇక్కడి నాయకులు మాత్రం దానిని సద్వినియోగం చేసుకోవడం లేదని జాతీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహాలో పార్టీలో నాయకులు పనిచేస్తే అధికారంలోకి రావడం చాలా కష్టమని కేంద్ర నిఘా శాఖ అదికారులు హోం మంత్రి అమీత్ షాకు నివేదికలను పంపింది. నివేదికలను చూసిన అమీత్ షా వెంటనే తెలంగాణ నేతలను అత్యవసరంగా ఢిల్లీ రావాలని అదేశాలు జారీ చేశారు.
అదిష్టానం పిలుపు మేరకు పార్టీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్,పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళిధర్ రావు,తో తెలంగాణ ముఖ్య నేతలు డిల్లీ వెళ్ళారు.పార్టీ వ్యవహారాలపై, ముఖ్య నేతల మధ్య లేకపోవడం వల్ల నష్టపోతుందని తెలంగాణ నాయకుల పై అమీత్ షా సీరియస్ అయినట్లు తెలిసింది. విభేదాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ ఐక్యతతో పని చేయాలని సూచించారు.అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారాని. కెసిఆర్ కుటుంబ పాలన, అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో వైఫల్యం చెందుతున్నారని తెలంగాణ బీజేపీ నాయకులకు అదిష్టానం క్లాస్ తీసుకున్నాట్లు సమాచారం.ముఖ్య నాయకులు తమ వ్యవహార శైలిని మార్చుకొని సమన్వయంతో పనిచేయాలని అమీత్ షా సూచించిన్నాటు తెలిసింది.
