ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీ- బస్సుకు మంటలు

 

మునగాల:

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. తెలంగాణ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందిరానగర్‌ వద్దకు చేరుకోగానే బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు కింది భాగంలోకి బైక్‌ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు బస్సుకు వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో అందులోని ప్రయాణికులంతా వెంటనే కిందికి దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ద్విచక్ర వాహనదారుడు మురుగేష్‌ రాజు (48)కి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సూర్యాపేట తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest