- ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ గురుకుల విద్యార్థిని
- కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న అగసర నందిని
- అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్,SCDD, సెక్రటరి రాహుల్ బొజ్జా,
- TSWREIS సెక్రటరీ డాక్టర్ .నవీన్ నికోలస్
హైదరాబాద్, 01 అక్టోబర్ 2023:
ఆసియా క్రీడాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందిని హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకాన్ని ఛేజిక్కికుంది. నందిని సంగారెడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ (BBA) రెండో సంవత్సరం చదువుతున్నది. నర్సింగి లోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నది.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఐనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. సాధారణ కుటుంబంలో నందిని జన్మించింది. ఆమె తండ్రి యల్లయ్య చాయ(T) అమ్ముతూ తన కూతురు ను గురుకుల పాఠశాల లో చేర్పించారు. నందిని విద్య లో రానిస్తూనే క్రీడా రంగంపై ఆసక్తి పెంచు కున్నది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆసియా క్రీడలకు ఎంపిక అయ్యింది. అంతే కాదు నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తోంది.
గురుకుల విద్యార్థిని నందిని ఆసియా క్రీడాల్లో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సి కార్పొరేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, TSWREIS సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్, గురుకుల విద్యా సంస్థల సిబ్బంది అభినందనలు తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం సాధించడం రాష్ట్రనికే గర్వకారణం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.