హైదరాబాద్ (కాప్రా)
హైదరాబాద్ కుషాయిగూడ పరిధి కాప్రాలోని కందిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.మృతులను దంపతులు సతీశ్ (39), వేద (35), చిన్నారులు నిషికేత్ (9),నిహాల్ (5)గా గుర్తించారు. పిల్లల అనారోగ్యం కారణంగా సైనేడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సతీశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.