ఈడీ నుంచి మరోసారి కవితకు పిలుపు

హైదరాబాద్‌:

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. మంగళవారం ఢిల్లీ కార్యాలయానికి రావాలని కోరింది. ఈడీ పిలుపుపై స్పందించిన కవిత.. ప్రతిగా తన లీగల్‌ అడ్వైజర్‌ను పంపించారు.

కాగా మార్చి 11న ఎమ్మెల్సీ కవితకు చెందిన ఫోన్‌ను ఈడీ అధికారులు సీజ్‌ చేయగా.. ఈనెల 21న ఎమ్మెల్సీ తన 9ఫోన్లను ఈడీకి అందజేశారు. అయితే సీజ్‌ చేసిన ఫోన్లను ఓపెన్‌ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్‌ అడ్వైజర్‌ సోమా భారత్‌కు ఆథరైజేషన్‌ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు పంపించారు.

ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈనెల 11,20,21 తేదీల్లో ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest