ఈ సభ ఆలోచనలో ఉంది ఇంకా ఫైనల్ అవ్వలేదు

హైదరాబాద్ , మార్చి 02 :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాట్స్ అప్ గ్రూపుల్లో గురువారం ఒక పోస్టర్ బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఉన్న హెడ్డింగ్ ఏందంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రియాంక గాంధీ సభ. సభ ప్రాంగణం పేరు ఇందిరా ప్రియదర్శిని. సభ: మే 14 మాతృ దినోత్సవం రోజు , దేశ చరిత్రలో మొట్ట మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఆ రోజు ప్రకటిస్తారు. 500000 మంది మహిళలతో విన్నూత్నంగా సభ. ఇంతవరకు బాగానే ఉంది. పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. పైన ప్రియాంక గాంధీ బొమ్మ , నడుచుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి బొమ్మ కింద ఉంది. అన్నిటికంటే పోస్టర్ లో కింద ఒక లైన్ ఉంది. అందులో ఇలా రాసి ఉంది (ఈ సభ ఆలోచనలో ఉంది ఇంకా ఫైనల్ అవ్వలేదు) ని రాసి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొషల్ మీడియా ఎవరూ హ్యాండిల్ చేస్తారో కానీ ఇలాంటి అసంపూర్తిగా ఉన్న న్యూస్ జనాల్లోకి వెళ్తే జనం ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞ్యానం కూడా లేనట్టుంది. సిరిసిల్లలో ప్రియాంక గాంధీ సభ ఇదంతా బాగానే ఉంది. ఇంకా ఫైనల్ కాకముందే ఇలాంటి పోస్టర్ ను సోషల్ మీడియా లో వదలడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో కానీ కింద రాసిన ఒక్క లైన్ వల్ల ఉన్న పరువు కాస్త బజారున పడుతోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలారా? మీరు చెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీ పరువును పెంచడం… కింద పడేయడం కాదు. ఇలాంటి పోస్టర్లు మీ అపోజిషన్ పార్టీ వాళ్లకు దొరికితే మీకు ఉంటది జింతాతా….

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest